Newborn Babies : పుట్టిన బిడ్డల్ని చంపి ఫ్రిడ్జ్‌లో దాచిపెడుతున్న తల్లి .. ఆమె చెప్పింది విన్న పోలీసులు షాక్
పుట్టిన బిడ్డల్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకోవాల్సిన తల్లి చంపి ఫ్రిడ్జ్ లో దాచింది. దీని కారణం ఏదైనా కావచ్చు కన్నతల్లే కసాయిగా మారిన క్రమంలో బిడ్డలు అత్యంత పాశవికంగా చంపబడ్డారు కన్నతల్లి చేతుల్లో..

woman assassinated her newborns
woman assassinated her newborns Babies: కన్న బిడ్డ పాల కోసం ఏడిస్తేనే తల్లి గుండె తల్లడిల్లిపోతుందే..బిడ్డ ఆకలితో ఏడిస్తే కడుపులోంచి తీసి అయినా బిడ్డ కడుపు నింపుతుందే..అటువంటి తల్లి కన్నబిడ్డల్ని చంపి ఫ్రిడ్జ్ లో దాచి పెడుతున్న ఘటన మాతృత్వానికే మాయని మచ్చలా కనిపిస్తోంది. దక్షిణకొరియాలో జరిగిన ఈ అత్యంత దారుణ ఘటన విన్న పోలీసులే షాక్ అయ్యారు. ఓ మహిళ తను కన్న బిడ్డల్ని పురిటిలోనే చంపేసి మృతదేహాలను ఫ్రిడ్జ్ లో దాచి పెట్టింది. సదరు మహిళ గర్భంతో ఉన్నట్లు..ప్రసవం జరిగినట్లుగా ఆస్పత్రుల్లో రికార్డులున్నాయి. వారి పేర్లు మాత్రం రికార్డుల్లో లేవు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా ఆ దారుణం వెలుగులోకి వచ్చింది.
Odisha Raids : రూ.2 కోట్లను పక్కింట్లోకి విసిరేసిన సబ్ కలెక్టర్ ..
దీంతో ఆమెను అరెస్ట్ చేయటానికి పోలీసులు కోర్టును అనుమతి కోరారు. ఈలోగా ఆమెను విచారించటానికి ఆమె ఇంటికి వచ్చారు. కానీ పోలీసులకు ఆమె సహకరించలేదు. పోలీసులు సెర్చ్ వారెంట్ తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్ లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఇప్పటికే తనకు 12,10,8 ఏళ్ల పిల్లలు ఉన్నారని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేశానని చెప్పింది. అది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అంత పేదరికం ఉంటే బిడ్డల్ని కనటం ఎందుకు? వారిని చంపటం ఎందుకని ప్రశ్నించారు. దానికి ఆమె వద్ద సమాధానం లేదు.
పుట్టిన తర్వాత నవజాత శిశువును గొంతుకోసి చంపి మృతదేహాన్ని తన ఇంట్లో ఫ్రీజర్‌లో పెట్టింది. తన నాలుగవ సారి పుట్టిన బిడ్డను..ఆ తరువాత పుట్టిన ఐదవ బిడ్డను కూడా అలాగే హత్య చేసింది. కానీ ఈ హత్యల గురించి తనకు తెలియదని ఆ మహిళ భర్త చెప్పాడు. ఆమె రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నాని ఆమె నాతో చెప్పింది అంటూ పోలీసులకు చెప్పాడు.
Andhra Pradesh : కూరలో విషం కలిపి మహిళను హత్య చేసిన అత్తింటి కుటుంబం
సువాన్ నగరానికి చెందిన ఆమెకు 2018లో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను మరుసటిరోజు చంపి మృతదేహాన్ని ఫ్రిజ్ లో పెట్టింది. ఆ తరువాత 2019లో మరో పాప పుట్టింది. ఆ బిడ్డను కూడా చంపి ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఈ విషయాలను ఎట్టకేలకు అంగీకరించింది. శుక్రవారం (జూన్ 23,2023) అరెస్ట్ వారెంట్ సంబంధించి మరోసారి విచారణకు హాజరైంది.