HRC: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు.. HRC సీరియస్.. విచారణకు ఆదేశం..

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

HRC: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు.. HRC సీరియస్.. విచారణకు ఆదేశం..

Updated On : July 28, 2025 / 9:08 PM IST

HRC: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. అక్రమ సరోగసి, శిశువుల విక్రయంపై స్పందించిన హెచ్ ఆర్ సీ.. సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సృష్టి సెంటర్ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ నమ్రతను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగిన ఘరానా మోసం గురించి హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు అందింది. సమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది HRC. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన విచారణకు ఆదేశించింది కమిషన్.

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

సృష్టి సరోగసి వ్యవహారంపై సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్.. పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు మరో రెండు కేసులు.. (శిశువులను విక్రయించే రాకెట్, నాగర్ కర్నూల్ జిల్లాలో జ్యోతిబా పూలే సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అంశం).. ఈ మూడింటిపై మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.

Also Read: వెలుగులోకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు..ఐవీఎఫ్‌కు 200మంది రిజిస్ట్రేషన్లు.. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న దంపతులు..

ఈ మూడు అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతో పాటు వైద్య శాఖ అధికారులు, ప్రధాన కార్యదర్శి కూడా పూర్తి నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. డాక్టర్ నమ్రత, అతడి కుమారుడిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై రేపు సికింద్రాబాద్ కోర్టు విచారించే అవకాశం ఉంది. వారి కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందో లేదో అన్నదానిపై రేపు క్లారిటీ రానుంది.