విషాదం : ఉపాధ్యాయులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య  

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:13 PM IST
విషాదం : ఉపాధ్యాయులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య  

విశాఖ : విద్యా కుసుమం రాలిపోయింది. జిల్లాలో ఓ విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. ఉపాధ్యాయులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో కొర్రా మోహన్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈనేపథ్యంలో ఆశ్రమ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధ్యాయులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.