Andhra Pradesh : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై ఎస్సై దాడి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో చిలమత్తూర్ మండలంలో దారుణం జరిగింది.

Si Daadi
Andhra Pradesh : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో చిలమత్తూర్ మండలంలో దారుణం జరిగింది. సంజీవరాయని పేట గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి దివ్యాంగురాలైన తన తల్లికి పెన్షన్ ఇవ్వాలని కోరితే వైసీపీ నేత దామోదర్‌రెడ్డి దాడి చేశాడు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే.. చిలమత్తూర్ ఎస్‌ఐ బూతులు తిట్టి స్టేషన్‌లోనే వేణుపై దాడి చేశాడు.
విషయం తెలుసుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందంటూ ఫైరయ్యారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రశ్నించారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని.. బాధితుడి తల్లికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఘటన రెండు రోజుల క్రితం జరగ్గా… ఈ వీడియో ఇప్పుడు స్ధానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Raja Singh : ఆవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-రాజాసింగ్