Actress Radha : కొట్టి, వేధిస్తున్నాడని ఎస్సై పై కేసు పెట్టిన హీరోయిన్

తన రెండో భర్త కొట్టి వేధిస్తున్నాడని తమిళ హీరోయిన్ రాధ (38) పోలీసులను ఆశ్రయించారు. సుందర్ ట్రావెల్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన రాధ ఆ సినిమా తర్వాత అదావతి, మనస్థాన్, కధవరాయన్ వంటి పలు సినిమాల్లో నటించారు.

Actress Radha : కొట్టి, వేధిస్తున్నాడని ఎస్సై పై కేసు పెట్టిన హీరోయిన్

Sundhara Travels' Actress Radha

Updated On : April 16, 2021 / 2:55 PM IST

Sundhara Travels’ actress Radha complaint against her second husband : తన రెండో భర్త కొట్టి వేధిస్తున్నాడని తమిళ హీరోయిన్ రాధ (38) పోలీసులను ఆశ్రయించారు. సుందర్ ట్రావెల్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన రాధ ఆ సినిమా తర్వాత అదావతి, మనస్థాన్, కధవరాయన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గటంతో తెరమరుగైంది. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికి గతకొన్నేళ్లుగా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పడు తాజాగా రెండో భర్త తనను కొట్టివేధిస్తున్నాడని ఆమె విరుంగబాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నరాధ తన తల్లి,కుమారుడితో కలిసి చెన్నైలోని సాలిగ్రాం లోని లోకయ్య వీధిలో నివసిస్తోంది. ఆమెకు ఎస్సై వసంతరాజ్  ఓ సినిమా షూటింగ్ సమయంలో  పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య సన్నిహితం బాగా పెరిగింది. ఈక్రమంలో తిరువాన్మీయూర్ పోలీసు స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వసంత్ రాజ్ ఆర్కేపురం పోలీసు  క్వార్టర్స్ లో నివసించేవాడు.

Actress Radha 1

 

రాధ కోసం వడపళని పోలీసు స్టేషన్ కు పోస్టింగ్ మార్పించుకున్నాడు.  వసంత్ రాజ్ కి ఇద్దరు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసి రాధ అతనితో  ప్రేమలో పడింది.  దీంతో ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరగింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న వసంత్ రాజ్ రాధను రహస్యంగా వివాహం  చేసుకుని ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వ్యవహారం తెలసుకున్నవసంతరాజ్ భార్య  గతంలోనే తిరువాన్మీయూర్ స్టేషన్ సీఐ కి ఫిర్యాదు చేసింది.

Radha

Radha

ఈక్రమంలో రాధ ఇటీవల ఆధార్ కార్డులో తనకు భర్తగా, పిల్లవాడికి తండ్రిగా వసంత్ రాజ్ పేరు అప్ డేట్ చేయించింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి వసంత్ రాజ్ఆమెను దూరం పెట్ట సాగాడు. అదేమని అడిగితే ఆమెపై చేయిచేసుకోవటం ప్రారంభించాడు. ఇంతకు ముందు సాలిగ్రామం కుదగ్గరలోని వడపళని పోలీసు స్టేషన్ లో ఉండేవాడు ఆమె ప్రవర్తనతో ఎన్నూరుపోలీసు స్టేషన్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.

రాధ మెడలో తాళి కట్టిన వసంత్ రాజ్ ఆమెతో కాపురం చేయసాగాడు.  ప్రేమికుడు తన మెడలో తాళి కట్టి కాపురం చేస్తండటంతో రాధ ఇటీవల ఆధార్ కార్డులో తనకు భర్తగా, పిల్లవాడికి తండ్రిగా వసంత్ రాజ్ పేరు అప్ డేట్ చేయించింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి వసంత్ రాజ్ ఆమెను దూరం పెట్టసాగాడు. అదేమని అడిగితే ఆమెపై చేయిచేసుకోవటం ప్రారంభించాడు.

Radha

Radha

ఈమె ప్రవర్తనతో వడపళని పోలీసు స్టేషన్  నుంచి ఎన్నూరు పోలీసు స్టేషన్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. అదేమని అడిగితే ఆమెను కొట్టి వేధించసాగాడు. విసుగు చెందినరాధ ఒక రోజు ఎన్నూరు  పోలీసు స్టేషన్ కు వెళ్లి గొడవ పడింది. తనకు దూరంగా ఉండమని లేకపోతే పోలీసు దెబ్బ చూపిస్తానని భర్త వార్నింగ్ ఇచ్చాడు. మోసపోయానని భావించిన రాధ గురువారం విరుగంబాక్కం పోలీసు స్టేషన్ లో రెండో భర్తపై ఫిర్యాదు చేసింది.  కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

Radha

Radha

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన రాధ చెన్నైలో పెరిగింది.సినీరంగంలో హీరోయిన్ గా అవకాశాలున్న రోజుల్లోనే ఆమె తరచూ వార్తల్లోకెక్కేది. ఒక సారి సినీ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో క్రమేపి ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ తర్వాత 2013 లో ఆమె తన మొదటి భర్త, నిర్మాత, డైమండ్ వ్యాపారి ఫజల్ పై కేసు నమోదు చేసింది.

పెళ్లి చేసుకుని ఆరేళ్లపాటు తనతో కాపురం చేసి బిడ్డకు జన్మనిచ్చిన ఫజల్ తననుమోసం చేసాడని ఆరోపించింది. తన డబ్బులు తీసుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే తామిద్దరం సన్నిహితంగా ఉన్నవీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడని వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది.కాగా తాను ఆమెను పెళ్లి చేసుకోలేదని ఫజల్ వివరించాడు.

ఈ క్రమంలో ఆమె తన మొదటి భర్త నుంచి విడిపోయిన ఈమెకు వసంత రాజ్ (40) పరిచయం పెళ్లి…. ఇప్పడు మళ్లీ పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు ఈ కేసు ఎలా దర్యాప్తు చేస్తారో వేచి చూడాలి.