Suspected Terrorist : కశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్‌..!

కశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Suspected Terrorist : కశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్‌..!

Suspected Lashkar E Toiba Terrorist Arrested In J&k Police

Updated On : November 12, 2021 / 10:22 PM IST

Suspected Terrorist :  కశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. ఉగ్రవాదికి లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు.

పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి సమాచారం అందండంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఖాన్‌ ప్రాంతంలో పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒకరిని గుర్తించారు.

అతన్ని ప్రశ్నిస్తుండగా.. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు.. ఎక్కడ నుంచి వస్తున్నావని విచారించారు. తన పేరు అర్షద్ మీర్ గా చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అర్షద్‌ మీర్, తన సోదరుడు లతీఫ్ అహ్మద్ గ్రూప్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో ఖీర్‌ భవానీ పోలీస్‌స్టేషన్‌లో ఉపా (UAPA), ఆయుధాల చట్టంలోని సెక్షన్‌ 13 అండ్‌ 39 కింద లతీఫ్‌ మీర్‌ను అరెస్టు చేశారు. అర్షద్‌ అహ్మద్‌ మీర్‌పై పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలా (నివారణ) చట్టం, ఆయుధాల చట్టం కింద పలు కేసులు నమోదు అయ్యాయి.