Tamilnadu : పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు .. ఛానల్ మార్చమన్నందుకు భార్య అలక, భర్త మృతి

 పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు పెట్టింది. భార్యా భర్తల ఇద్దరు మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Tamilnadu : పచ్చని కాపురంలో సీరియల్ చిచ్చు .. ఛానల్ మార్చమన్నందుకు భార్య అలక, భర్త మృతి

tamilnadu

man life Ended wife serial habit : పచ్చని కాపురంలో టీవీ సీరియల్ చిచ్చు పెట్టింది. భార్యా భర్తల ఇద్దరు మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. టీవీ చానల్ మార్చమని భార్యను భర్త కోరగా ససేమిరా అంది భార్య. దీంతో భర్త కోపం తారాస్థాయికి చేరుకుంది. భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అలా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన సీరియల్ సదరు భర్త ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

తమిళనాడులోని తిరువళ్లూరులో నివసిస్తున్న ఓ కుటుంబంలో టీవీ సీరియల్ తీవ్ర విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఆశీర్వాదం తన భార్య నిషాతో జీవిస్తున్నాడు. నిషాకు టీవీ సిరియల్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఆశీర్వాదం సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. దీంతో భార్యను చానల్ మార్చమని కోరాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆశీర్వాదం కోప్పడ్డాడు. ఆ కోపం కాస్తా ఇద్దరి మధ్యా వాదోపవాదనలు దారి తీసింది. ఆశీర్వాదం భార్యపై తీవ్రంగా అరిచాడు. అలా ఇద్దరు మధ్యా మాటలు పెరిగాయి.

Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు

దీంతో ఆశీర్వాదం విసిగిపోయి బయటకు వెళ్లిపోయాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికొచ్చి చూసేసరికి భార్య లేకపోవటంతో ఆశీర్వాదం మనస్తాపానికి గురయ్యాడు. మర్నాడు ఉదయం భార్యకు కోపం తగ్గి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చి చూసేసరికి భర్త ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. అంతే ఆమె షాక్ అయ్యింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.