తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : December 9, 2020 / 10:03 AM IST
తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య

Updated On : December 9, 2020 / 10:23 AM IST

Tamil TV actress VJ Chithra of Pandian Stores fame dies by suicide : ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం చెన్నైలోని ఓ హోటల్ రూం లో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవలే ఆమెకు చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హేమంత్ తో నిశ్చితార్ధం కూడా జరిగింది. చిత్ర నటించిన పాండియన్ స్టోర్స్ టీవీ సీరియల్ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ షోలో ఆమె పోషించిన ముల్లై పాత్రతో బాగా గుర్తింపు పొందింది. చిత్ర పలు సినిమాల్లోనూ నటించింది.
vj chitra 2
నిన్న రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని తెల్లవారుఝూమున గం.2-30 సమయంలో తాను బసచేసిన నజరత్ పేటలోని ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కాబోయే భర్త హేమంత్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె ఆత్మహత్యపై విభిన్న కధనాలు వినిపిస్తున్నాయి. తనను బయటకు పంపించి చిత్ర ఆత్మహత్య చేసుకుందని హేమంత్ చెపుతున్నాడు.
Tamil_actress-VJ_Chithra_dies_by_suicide
మరోక కధనం ప్రకారం షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన చిత్ర తాను స్నానానికి వెళుతున్నానని హేమంత్ తో చెప్పి బాత్రూంలోకి వెళ్లింది. ఎంతసేపటికి బయటకు రాకపోవటంతో హేమంత్ హోటల్ సిబ్బందితో చెప్పి డూప్లికేట్ కీ తో తలుపు తెరిచి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిందని చెపుతున్నారు. డిప్రెషన్ తో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మరోక వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఆమె మరణం తమిళ టీవీ సీరియల్ ప్రేక్షకులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.

Pandian-Stores-serial