Tamilnadu : భార్య, అత్తను కత్తితో పొడిచి చంపిన ఉన్మాది

తమిళనాడులో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్యా,అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటు చేసుకుంది.

Tamilnadu : భార్య, అత్తను కత్తితో పొడిచి చంపిన ఉన్మాది

Tamilnadu Murder

Updated On : March 16, 2021 / 6:07 PM IST

Tamilnadu : Man attacked his wife and aunt with a knife : తమిళనాడులో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్యా,అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మహిళ తన కూతురుతో చిన్నపాపను ఎత్తుకుని రోడ్డుపై నడిచివెళుతున్నారు.

ఆ సమయంలో వారిని వెంబడించి వెళుతున్న సదరు కూతురు భర్త ఒక్కసారిగా ఉన్మాదిలా మారాడు. అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్నకత్తితో భార్యను, అత్తను విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. భార్యా పారిపోవటానికి ప్రయత్నించగా ఆమెను వెంటపడి పొడిచి మరీ చంపాడు.

ఈఘటనలో తల్లీ కూతుళ్ళు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.