Teacher Drills Student’s Palm : ఎక్కాలు చెప్పలేదని విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్‌ చేసిన ఉపాధ్యాయుడు

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్‌ చేశాడు.

Teacher Drills Student’s Palm : ఎక్కాలు చెప్పలేదని విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్‌ చేసిన ఉపాధ్యాయుడు

teacher drills student's palm

Updated On : November 27, 2022 / 7:13 AM IST

Teacher Drills Student’s Palm : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్‌ చేశాడు. కాన్పూర్‌ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వివాన్ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24న విద్యార్థి పాఠశాల లైబ్రరీ వద్ద ఉన్నాడు.

గమనించిన ఉపాధ్యాయుడు అనుజ్ పాండే అతడిని మందలించడంతోపాటు రెండో ఎక్కం చెప్పమని అడిగాడు. అయితే విద్యార్థి వివాన్‌ రెండో ఎక్కం చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుడు ఆగ్రహించాడు. లైబ్రరీ వద్ద పని చేస్తున్న వ్యక్తి నుంచి డ్రిల్‌ మెషిన్‌ తీసుకున్నాడు. విద్యార్థి అర చేతిపై డ్రిల్‌ చేశాడు.

UP: ఒకే ఒక పదం తప్పు రాశాడని.. దళిత విద్యార్థిని రాడ్డుతో కొట్టిన టీచర్.. విద్యార్థి మృతి

దీంతో అక్కడే ఉన్న కృష్ణ అనే మరో విద్యార్థి వెంటనే మెషిన్‌ డ్రిల్‌ ప్లగ్‌ను తీసేశాడు. అప్పటికే విద్యార్థి వివాన్‌ అర చేతిలో డ్రిల్‌ దిగడంతో గాయపడ్డాడు. తన స్నేహితుడు స్పందించకపోతే అర చేతిలో మరింత లోతుగా ఆ డ్రిల్‌ దిగేదని బాధిత విద్యార్థి వాపోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.