Singareni Worker Murder : గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడు రాజేందర్ హత్య..
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో అర్థరాత్రి కాల్పులు కలకలం రేపాయి. గంగానగర్ లో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురి అయ్యాడు.

Singareni Worker Murder
Singareni Worker Murder : పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో అర్థరాత్రి కాల్పులు కలకలం రేపాయి. గంగానగర్ లో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురి అయ్యాడు. హెల్మెట్లు పెట్టుకుని ఇంట్లోకి చొరబడ్డ కొంతమంది దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న కార్మికుడు రాజేందర్ ను కాల్చి చంపారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో హెల్మెట్లు పెట్టుకుని రాజేందర్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశారు.
గోదావరిఖనిలోని గంగానగర్‌కు చెందిన పొరకొప్పుల రాజేందర్ అనే కార్మికుడు శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం (19,2022) రాత్రి ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆయన తలపై తుపాకీతో కాల్చారు. పాయింట్ బ్లాక్‌లో కాల్చడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు రాజేందర్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.