Andhra Pradesh : ఆర్ధిక ఇబ్బందులతో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న బొల్లి దివ్యవాణి(31) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాకు చెందిన దివ్యవాణి ఏపీలో పని చేస్తోంది.

Andhra Pradesh : ఆర్ధిక ఇబ్బందులతో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య

bapatla suicide

Updated On : May 23, 2022 / 3:55 PM IST

Andhra Pradesh :  బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న బొల్లి దివ్యవాణి(31) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాకు చెందిన దివ్యవాణి ఏపీలో పని చేస్తోంది. మట్లపూడి బ్యాంక్ లో పని చేస్తున్నసమయంలో బ్యాంకు నుంచి రూ. 40 లక్షల  రూపాయలు రుణం తీసుకుని గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించింది. దాన్ని వేరోక వ్యక్తికి అద్దెకు ఇచ్చింది.

గత కొన్నిరోజులుగా బ్యాంకులో పని ఒత్తిడి పెరిగిందని…. ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయని ఇటీవల సొంత ఊరు వెళ్ళినప్పుడు ఆమె తల్లి తండ్రులకు వివరించింది. వారు ఆమెను సముదాయించి పంపారు. అక్కడి నుంచి తిరిగి గుళ్ళపల్లి వచ్చి విధులు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఆదివారం ఉదయం ఇంట్లో అద్దెకు ఉన్నవ్యక్తి గమనించి స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతురాలి తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.