అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రదాడి : నలుగురు విద్యార్థుల మృతి

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్ జిల్లాలో ఓ పోలీస్ చెక్‌పాయింట్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్ దాడి చేయగా అది చెక్‌పాయింట్ సమీపంలోని పాఠశాలలో పడడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు.
మృతి చెందిన విద్యార్థులంతా 10 నుంచి 16 ఏళ్ల లోపు ఉన్నవారేనని పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇటీవల భద్రతా బలగాలే లక్ష్యంగా తాబిబన్లు దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ దాడి కూడా వారే చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.