Madhapur Audi Car Accident Case : మాదాపూర్ ఆడికారు యాక్సిడెంట్ కేసులో ముగ్గురు అరెస్ట్
మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర అదివారం తెల్లవారు ఝూమున జరిగిన ఆడికారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.

Madhapur Audi Car Accident Case
Madhapur Audi Car Accident Case : మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర అదివారం తెల్లవారు ఝూమున జరిగిన ఆడికారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఇప్పటి వరకు కారు డ్రైవర్ ప్రమాదానికి కారణం అని అంతా భావించారు. కానీ అసలు అందులో కారు డ్రైవర్ లేడని, సుజీత్ రెడ్డి, ఆశిష్ అనే ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
యువకులు ఇద్దరూ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు తేల్చారు. కాగా…. కారు ప్రమాదానికి కారణం మరో వ్యక్తి అంటూ సుజిత్ రెడ్డి తండ్రి రఘునందన్ రెడ్డి పోలీసుల ముందు డ్రామా ఆడారు. కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకే విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించే సరికి రఘునందన్ నిజం ఒప్పుకోక తప్పలేదు. కొడుకును రక్షించుకునేందుకు రఘునందన్ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డిని నల్లకుంట డీడీ కాలనీలో దాచి పెట్టాడు.
ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేష్ కుమార్ అక్కడికక్కడ చనిపోయాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కారు నడిపిన వ్యక్తి ఉప్పల్‌లోని విజయ్‌పురి కాలనీలో ఉండే వాకిటి రఘునందన్ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డి(24)గా గుర్తించారు. ఇతను గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం రాత్రి స్నేహితుడు పి.ఆశిష్‌తో కలిసి కారులో రాయదుర్గంలో వచ్చాడు. అక్కడే తెల్లవారుజాము వరకు మద్యం తాగి ఉదయం ఇంటికి బయలు దేరారు. మత్తులో కారు నడిపిన సుజిత్.. అతివేగంతో నిర్లక్ష్యంగా ఆటోను ఢీకొట్టాడు. పోలీసులు ఆధారాలు చూపించే సరికి తండ్రి సుజిత్ రెడ్డిని పోలీసులకు అప్పచెప్పారు.
తప్పు చేసిన కొడుకును దాచి పెట్టినందుకు రఘునందన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్ కు పంపారు. రఘునందన్ రెడ్డి, పై ఐపీసీ సెక్షన్ లు 202, 203. 205.212 కింద కేసు నమోదు చేశారు. సుజీత్ రెడ్డి, ఆశిష్ లపై ఐపీసీ సెక్షన్లు కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.