బాలుడిపై ఏడాదిగా ముగ్గురు బాలల లైంగిక దాడి
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై మరో ముగ్గురు బాలలు ఏడాది కాలంగా లైంగిక దాడి చేస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై మరో ముగ్గురు బాలలు ఏడాది కాలంగా లైంగిక దాడి చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై మరో ముగ్గురు బాలలు ఏడాది కాలంగా లైంగిక దాడికి చేస్తున్నారు. చంద్రాయణగుట్టలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో చోటు చేసుకుంది. బాధిత బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ బాలుడు చంద్రాయణగుట్టలోని గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్ లో ఒకే తరగతి చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అతడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భయపెట్టారు.
ఇటీవల బాధితుడి తండ్రి స్కూల్ దగ్గరకు వెళ్లగా కొడుకు నీరసంగా కనిపించాడు. దీంతో ఏమిటని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. వెంటనే తండ్రి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read : వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు