కాలువలోకి దూసుకెళ్లిన బస్సు…డ్రైవర్ సహా ముగ్గురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. లఖింపూర్ నుంచి పలియా ప్రాంతానికి వెళుతోన్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి పలియా కొత్వాలీ ప్రాంతంలో లోతైన కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. మృతులు అరుణ్ కుమార్ మిశ్రా (35), అష్ఫక్ అలీ (60), అజిత్ మిశ్రా (18)గా గుర్తించామని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ… ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారని, మరో 12 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో కొందరిని జిల్లా ఆస్పత్రికి తరలించామని, మరికొందరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని అధికారులు తెలిపారు. పలియా నగరానికి కొంతదూరంలో ఉన్న శారద బ్రిడ్జ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్-ట్రాలీకి దారి ఇవ్వడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించిన సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్పారు. పలియా డిప్యూటీ ఎస్పీ ప్రదీప్ యాదవ్‌తో పాలు పలువురు పోలీసు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.