JNUలో దుండగుల బీభత్సం : ఐరన్ రాడ్లతో విద్యార్థులు, లెక్చరర్లపై దాడి

ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 03:59 PM IST
JNUలో దుండగుల బీభత్సం : ఐరన్ రాడ్లతో విద్యార్థులు, లెక్చరర్లపై దాడి

Updated On : January 5, 2020 / 3:59 PM IST

ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.

ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. మాస్క్ లు ధరించిన 50 మంది దుండగులు… విద్యార్థులు, లెక్షరర్లపై దాడి చేశారు. జేఎన్ యూలోని కార్లు, బైక్ లను ధ్వంసం చేశారు. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పై దుండగులు దాడి చేశారు. 

జేఎన్​యూ విద్యార్థులపై దాడి చేసింది ఏబీవీపీ సభ్యులేనని వర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జేఎన్​యూలో జరిగిన హింసపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్ స్పందించారు. ఘటన ఆశ్చర్యపరిచిందన్నారు. పోలీసులు వెంటనే హింసను ఆపాలని ఆదేశించారు. విద్యార్థులపై దాడికి తెగబడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో జేఎన్ యూలో భారీగా పోలీసులు మోహరించారు. వర్శిటీలో ఉద్రిక్తతలు తలెత్తిన కారణంగా పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.