Realtor Murder : రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చి రియల్టర్ దారుణ హత్య, మరొకరిపై ఫైరింగ్

రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘురెడ్డిపై దుండగులు తుపాకీలో కాల్పులు జరిపారు. స్కార్పియోలో గాయాలతో ఉన్న రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. అతన్ని పోలీసులు అస్పత్రికి తరలించారు.

Realtor Murder : రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చి రియల్టర్ దారుణ హత్య, మరొకరిపై ఫైరింగ్

Reltor Murder

Updated On : March 1, 2022 / 10:49 AM IST

thugs opened fire on realtor : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లపై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి దారుణ హత్య గావించబడ్డారు. మరోె రియల్టర్ రఘురెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రఘురెడ్డిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. స్కార్పియోలో గాయాలతో రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. తనపై కాల్పులు జరిగినట్టు రఘురెడ్డి స్థానికులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Boy fires gun : తండ్రిని అరెస్ట్​ చేస్తున్న పోలీసులపై నాలుగేళ్ల పిల్లాడు కాల్పులు

పోలీసులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రఘురెడ్డికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రఘురెడ్డి కారులో రక్తపు మరకలు ఉన్నాయి. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.

బాధితుడు ప్రయాణించిన కారులో రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఇంతకీ కాల్పులు జరిపింది ఎవరు? రియల్టర్‌తో ఆర్ధిక లావాదేవీలే కాల్పులకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత రియల్టర్‌కు చికిత్స అందించిన తర్వాత వివరాలు సేకరించబోతున్నారు.