TikTok Couple : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్…రూ.44 లక్షల కుచ్చు టోపి పెట్టిన దంపతులు

టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దంపతులు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.44 లక్షలు వసూలు చేసారు. తిరిగి చెల్లించమనే సరికి మాయమాటలు చెప్పటం ప్రారంభించారు.

TikTok Couple : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దంపతులు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.44 లక్షలు వసూలు చేసారు. తిరిగి చెల్లించమనే సరికి మాయమాటలు చెప్పటం ప్రారంభించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : Sam-Chay : ఒక్క ట్వీట్‌తో పుకార్లకు నాగచైతన్య చెక్…! నెటిజన్ల ఎమోషన్ చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రి అనే దంపతులు టిక్ టాక్ వీడియోలతో స్ధానికంగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడే నివసిస్తున్న గౌరిశంకర్ అనే వ్యక్తి  కుమార్తెను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తామని చెప్పి రూ. 44 లక్షలు వసూలు చేశారు.

Cherukumilli Gayatri

డబ్బులు తీసుకుని తమ కుమార్తెను విదేశాలకు పంపకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేసరికి వారు మాయమాటలు చెపుతూ వచ్చారు, కానీ డబ్బు చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చిన గౌరీ శంకర్ డబ్బులు తిరిగి చెల్లించమని తీవ్ర వత్తిడి చేశాడు. డబ్బులు కోసం వత్తిడి పెరిగే సరికి కేటుగాళ్లు ఇద్దరూ తమఫోన్లు స్విఛ్చాఫ్ చేసుకున్నారు.
Read Also : WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!
బాధితుడు గౌరీశంకర్ గోకవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. కోర్టు నిందితులకు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితుల్లో ఒకరైన చెరుకుమిల్లి గాయత్రి బీజేపీ కాకినాడ టౌన్ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు తెలిసింది. రాజకీయ పదవి అడ్డుపెట్టుకుని మోసం చేసిన గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Cherukumilli Gayatri 2

ట్రెండింగ్ వార్తలు