పశ్చిమ బెంగాల్‌లో దారుణం : టీఎంసీ ఎమ్మెల్యే హత్య 

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్ దారుణ హత్య గావించబడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : February 10, 2019 / 02:48 AM IST
పశ్చిమ బెంగాల్‌లో దారుణం : టీఎంసీ ఎమ్మెల్యే హత్య 

Updated On : February 10, 2019 / 2:48 AM IST

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్ దారుణ హత్య గావించబడ్డాడు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో దారుణ జరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్ దారుణ హత్య గావించబడ్డాడు. ఫిభ్రవరి 9 శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కృష్ణగంజ్‌ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 

నదియా జిల్లాలోని కృష్ణగంజ్‌ నియోజకవర్గం నుంచి సత్యజిత్‌ బిశ్వాస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిభ్రవరి 9 శనివారం రాత్రి పుల్‌బరీలో ఏర్పాటు చేసిన సరస్వతీపూజ కార్యక్రమంలో బిశ్వాస్‌ పాల్గొన్నారు. జనసమూహం ఎక్కువగా ఉండటతో ఇదే అదునుగా భావించిన దుండగులు అతి సమీపంలో నుంచి ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. స్థానికులు తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బీజేపీ నేతలే.. తమ పార్టీ ఎమ్మెల్యేను చంపించారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో బీజేపీ, టీఎంసీల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.