Trader Pramod : నాతో అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాక.. రానాకు రిజిష్ట్రేషన్ చేశారు : వ్యాపారి ప్రమోద్

ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లోని ప్లాట్ నెంబర్ టూలోని 1007 గజాల స్థలాన్ని నిర్మాత సురేష్ బాబు నుండి 2014 లో లీజుకు తీసుకున్నానని బిజినెస్‌మెన్ ప్రమోద్ తెలిపారు. 2018 నవంబర్ లో స్థలం అమ్ముతున్నారని తెలిసి 18 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నామని వెల్లడించారు.

Trader Pramod : నాతో అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాక.. రానాకు రిజిష్ట్రేషన్ చేశారు : వ్యాపారి ప్రమోద్

Pramod

Updated On : February 11, 2023 / 5:18 PM IST

Trader Pramod : భూవివాదంలో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరో రాణాపై క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరో రాణాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సురేష్ బాబు, రానా, క్రిష్ణాలతో పాటు ఇతరులకు సమన్లు పంపించింది. ఫిలింనగర్ లో సురేష్ బాబు తన స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి లీజుకి ఇచ్చారు. ప్రతి రెండేళ్ళకి ఆ లీజు రెన్యూవల్ చేయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఇంకా ఆ స్థలం లీజులో ఉండగానే అందులోని కొంతభాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, ఆ వ్యాపారిని ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంతో ఆ వ్యాపారి అప్పుడే పోలీసులకి ఫిర్యాదు చేశాడు, కోర్టుకి వెళ్ళాడు.

తాజాగా నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ప్రమోద్ కుమార్ ఆరోపణలు చేశారు. అలాగే సురేష్ బాబు, రానాపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కోర్టుని ఆశ్రయించానని తెలిపాడు. బాధితుడు కోర్టుని ఆశ్రయించడంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో పాటు మరి కొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు నోటీసులు పంపించింది. ఈ మేరకు వ్యాపారి ప్రమోద్ 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Daggubati Family: భూ వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాధితుడు

ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లోని ప్లాట్ నెంబర్ టూలోని 1007 గజాల స్థలాన్ని నిర్మాత సురేష్ బాబు నుండి 2014 లో లీజుకు తీసుకున్నానని బిజినెస్‌మెన్ ప్రమోద్ తెలిపారు. 2018 నవంబర్ లో స్థలం అమ్ముతున్నారని తెలిసి 18 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నామని వెల్లడించారు. అగ్రిమెంట్ లో భాగంగా ఐదు కోట్ల రూపాయలు చెల్లించానని.. మిగిలిన నగదు చెల్లించడానికి నాలుగు నెలల సమయం ఉన్నదని పేర్కొన్నారు. అదే సమయంలో భూమి రేట్ పెరగడంతో రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. 2019 నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. కానీ, 2021లో సురేష్ బాబు ఆయన కుమారుడు రానాకు రూ.9 కోట్లకు రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు.

దీంతో తనకున్న రైట్స్ కోల్పోతానని గుర్తించి కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించానని చెప్పారు. కేసు నమోదు చేయకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించానని పేర్కొన్నారు. నాంపల్లి కోర్టు సీసీ నెంబర్ 301 ఆఫ్ 2023 కింద ఐపీసీ సెక్షన్ 352,426, 447,503,506 ఐపీసీల కింద కాగ్నిజెన్స్ తీసుకొని సమన్లు జారీ చేసిందని తెలిపారు. ఈ వివాదంలో నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరో రాణాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సురేష్ బాబు, రానా, క్రిష్ణాలతో పాటు ఇతరులకు సమన్లు జారీ చేసింది.