Noida Tragedy : అత్యంత దారుణం.. బాల్కనీ నుంచి పెళ్లి ఊరేగింపును చూస్తున్న రెండేళ్ల బాబుని కాల్చి చంపేశాడు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో..

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Noida Tragedy : అత్యంత దారుణం.. బాల్కనీ నుంచి పెళ్లి ఊరేగింపును చూస్తున్న రెండేళ్ల బాబుని కాల్చి చంపేశాడు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో..

Updated On : February 18, 2025 / 1:35 AM IST

Noida Tragedy : నోయిడాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. తన ఇంట్లోని బాల్కనీ నుంచి పెళ్లి ఊరేగింపు చేస్తున్న రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చేయని తప్పుకు బలైపోయాడు. పెళ్లి ఊరేగింపులో ఓ వ్యక్తి గన్ తో గాల్లోకి కాల్చాడు. ఆ బుల్లెట్ నేరుగా బాబును తాకింది. అంతే.. చిన్నారి చనిపోయాడు.

నోయిడాలోని సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అఘాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపును స్థానికులు తమ తమ ఇళ్లలోని బాల్కనీలు, టెర్రస్ ల పై నుంచి చూస్తున్నారు. వారిలో రెండేళ్ల బాలుడు అన్ష్ శర్మ కూడా ఉన్నాడు. అన్ష్ శర్మ తండ్రి ఒడిలో ఉన్నాడు. వారంతా ఎంతో ఆసక్తిగా ఊరేగింపును చూస్తున్నారు.

Also Read : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..

ఇంతలో వరుడితో పాటు రథంపై నిలబడి ఉన్న అతడి స్నేహితుడు.. తుపాకీ తీసి గాల్లోకి కాల్చాడు. అంతే, ఘోరం జరిగింది. అతడు గాల్లోకి కాల్చగా.. బుల్లెట్ నేరుగా వెళ్లి.. బాల్కనీ నుంచి తండ్రితో పాటు ఊరేగింపును చూస్తున్న బాలుడి తలలోకి దూసుకెళ్లింది. అంతే, బాబు తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి చేతుల్లోనే చిన్నారి చనిపోయాడు. కళ్ల ముందే జరిగిన ఘోరాన్ని చూసి అతడి తండ్రి షాక్ కి గురయ్యాడు. వెంటనే కొడుకుని ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది. బాబు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గన్ తో గాల్లోకి కాల్చి ఒక చిన్నారిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తీవ్ర విషాదం నింపింది. పెళ్లి ఊరేగింపు చూడటమే పాపమైపోయింది. పెళ్లి ఊరేగింపులోని వ్యక్తి ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అక్కడ చుట్టూ ఇళ్లు ఉన్నాయని, ఆ ఇళ్ల నుంచి అందరూ బయటకు తొంగి చూస్తున్నారని తెలుసు. అయినా నిర్లక్ష్యంగా గన్ తో కాల్చడం ఏంటని మండిపడుతున్నారు. పాపం.. రెండేళ్ల చిన్నారి ఆ బుల్లెట్ కు బలైపోయాడు.

”పెళ్లి కొడుకు బంధువు ఒకరు గన్ తో గాల్లోకి కాల్చాడు. అదే సమయంలో వికాస్ శర్మ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి తన ఇంటి బాల్కనీలో నిల్చుని పెళ్లి ఊరేగింపును ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వరుడి బంధువు ఒకరు గాల్లోకి కాల్చాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ తండ్రి ఒడిలో ఉన్న బాబు అన్ష్ శర్మ తలని తాకింది. తీవ్రమైన గాయం కావడంతో బాబు చనిపోయాడు” అని పోలీసులు తెలిపారు.