Narasaraopeta Incident : సోషల్ మీడియాలో లీక్.. మహిళ ప్రాణం తీసిన ప్రైవేట్ వీడియో వివాదం.. నరసరావుపేటలో దారుణం..

ఆగ్రహంతో రగిలిపోయిన పార్వతి.. సిఫార ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Narasaraopeta Incident : సోషల్ మీడియాలో లీక్.. మహిళ ప్రాణం తీసిన ప్రైవేట్ వీడియో వివాదం.. నరసరావుపేటలో దారుణం..

Updated On : April 13, 2025 / 6:16 PM IST

Narasaraopeta Incident : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ వీడియో వివాదం ఒక మహిళ ప్రాణం తీసింది. నరసరావుపేట మండలం పమిడిమార్రుకు చెందిన మురికిపూడి సిఫార (23) ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

సిఫారకు అదే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తరుచూ తన ప్రైవేట్ సెల్ఫీ వీడియోలను నాగరాజుకు పంపింది సిఫార. అయితే, నాగరాజు పార్వతి అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో నాగరాజు కోసం సిఫార, పార్వతి మధ్య తరుచూ గొడవలు జరిగాయి.

Also Read : అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి దుర్మరణం.. బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్ గ్రేషియా

ఆగ్రహంతో రగిలిపోయిన పార్వతి.. సిఫార ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన వీడియోలు బయటకు లీక్ కావడంతో మనస్తాపం చెందిన సిఫార ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి దగ్గర ఆందోళన చేశారు.