ఆర్టీసీ బస్సు బీభత్సం : టీసీఎస్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబరు 12లో ఆర్టీసి బస్సు భీబత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ తో నడుపుతున్న బస్సు రోడ్డు పై వెళుతున్న స్కూటీ ని ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న మహిళ అక్కడికక్కడే మరణించింది.
మహిళ టీసీఎస్ లో ఉద్యోగం చేసే సోహినీ సక్సేనా గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహించిన కొందరు డ్రైవర్ కు దేహశుధ్ది చేశారు. ఈ లోపల పోలీసులు అక్కడుకుచేరుకుని డ్రైవర్ ను రక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా.. బ్రేక్ లు ఫెయిల్ కావడంవల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.