ప్రేమజంటపై దాడి కేసులో ట్విస్ట్: మేనమామ, బావలే చంపేశారా

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 12:44 PM IST
ప్రేమజంటపై దాడి కేసులో ట్విస్ట్: మేనమామ, బావలే చంపేశారా

Updated On : February 25, 2019 / 12:44 PM IST

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లిలో ప్రేమజంటపై దాడి, హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు నవీన్ కుటుంబసభ్యులు కొత్త కోణం వెలుగులోకి తెచ్చారు. ధరణి మేనమాన, బావలపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. పరువు కోసం వాళ్లే ధరణిని చంపేశారని ఆరోపిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలను పోలీసులు దాచిపెడుతున్నారని నవీన్‌ బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ధరణిని.. నవీన్ హత్య చేశాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి బంధువులే హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. శ్రీధరణి బావ, మామను విచారించాలని నవీన్‌ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు

సంచలనంగా మారిన ఈ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అసలు ధరణిపై దాడి చేసింది ఎవరు? చంపింది ఎవరు? అనేది ఇప్పటివరకు తెలియలేదు. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ప్రియురాలు ధరణి హత్యకు గురవగా.. ప్రియుడు నవీన్‌ నోరుమెదపడం లేదు.

శ్రీధరణి మృతిపై నవీన్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్‌ ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్‌ తలవెనుక భాగంలో బలమైన గాయలు అయినట్లు వైద్యలు వెల్లడించారు. నవీన్‌ను ఎప్పుడూ చూడలేదని అతనెవరో తెలియదని శ్రీధరణి తల్లిదండ్రులు అంటున్నారు. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన ముగురు వ్యక్తులకు నవీన్ నుండి చివరి ఫోన్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జి.కొత్తపల్లిలో అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, సిబ్బంది విచారణ జరుపుతున్నారు.
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?