హైదరాబాద్‌లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్ పేలుళ్లు
హైదరాబాద్‌లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్‌నగర్, మలక్‌పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.

హైదరాబాద్‌లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్‌నగర్, మలక్‌పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
హైదరాబాద్‌లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్‌నగర్, మలక్‌పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు. సిలిండర్ల పేలుళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
సరూర్ నగర్ PNT కాలనీలో మరో సిలిండర్ పేలుడు సంభవించింది. అర్ధరాత్రి 2గంటల తర్వాత సడెన్‌గా భారీ శబ్దం వచ్చి… ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారితోపాటు ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇలాంటిదే మరో ఘటన మలక్‌పేటలోని వెంకటాద్రి నగర్‌లో జరిగింది. అక్కడి ఓ ఇంట్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. కారణం ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఇంటి గేటు ధ్వంసమైంది. ఇంటి కిటికీలతోపాటూ… పక్క ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇంటి పైకప్పు ముక్కలైంది. అర్ధరాత్రి భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు.