New Zealand : న్యూజిలాండ్‌లో కాల్పులు, ఇద్దరి మృతి..షూటర్ హతం

న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ కప్ ప్రారంభం రోజే కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల ఘటన అనంతరం షూటర్ ను కాల్చి చంపినట్లు న్యూజిలాండ్ పోలీసులు చెప్పారు.....

New Zealand : న్యూజిలాండ్‌లో కాల్పులు, ఇద్దరి మృతి..షూటర్ హతం

Shooting In New Zealand

Updated On : July 20, 2023 / 5:27 AM IST

New Zealand : న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ కప్ ప్రారంభం రోజే కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల ఘటన అనంతరం షూటర్ ను కాల్చి చంపినట్లు న్యూజిలాండ్ పోలీసులు చెప్పారు. (Shooting In New Zealand) ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. (Gunman Dead)

Telangana : పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నగరంలో ఇళ్ల పంపిణీకి షెడ్యూల్ ఖరారు, ఏకంగా 70వేల ఇళ్లు..

ఈ కాల్పుల ఘటన వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని టోర్నమెంట్ అనుకున్న విధంగానే సాగుతుందని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ చెప్పారు. ప్రస్తుతం ఆక్లాండ్‌లో ఉంటున్న యూఎస్ జాతీయ జట్టు, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. దాడి చేసిన వ్యక్తితో పాటు ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే హెలికాప్టరులో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.