ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు

ఓవైపు ఎన్నికల హడావుడి ఉండగానే కొందరు వ్యక్తులు మాత్రం దోపిడీలకు ఎన్నికలనే అస్త్రంగా మలచుకుంటున్నారు.

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 05:03 AM IST
ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు

Updated On : March 23, 2019 / 5:03 AM IST

ఓవైపు ఎన్నికల హడావుడి ఉండగానే కొందరు వ్యక్తులు మాత్రం దోపిడీలకు ఎన్నికలనే అస్త్రంగా మలచుకుంటున్నారు.

ఒకవైపు ఎన్నికల హడావుడి ఉండగానే కొందరు వ్యక్తులు మాత్రం దోపిడీలకు ఎన్నికలనే అస్త్రంగా మలచుకుంటున్నారు. ఒంగోలులోని లాయరుపేటలో శుక్రవారం అర్థరాత్రి ఎన్నికల డబ్బులు పంచుతున్నాం అంటూ వచ్చిన ఇద్దరు దుండగులు ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. వీఐపీ రోడ్డులో నివసించే కూరపాటి పద్మ అనే వృద్ధురాలి ఇంటికి వచ్చిన దుండగులు ఎన్నికలలో నిలబడిన వ్యక్తి తరుపున డబ్బులు పంచుతున్నాం అంటూ వచ్చి 1:30 ప్రాంతంలో ఆధార్ కార్డు, ఓటరు కార్డు చూపించమన్నారు.

ఆమె కార్డు తెచ్చి చూపిస్తున్న సమయంలో ముఖం మీద తీవ్రంగా కొట్టి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసి ప్రక్కలవాళ్లు వచ్చేలోపు వాళ్లు దొరక్కుండా వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలి కుమారుడు ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.
Read Also : ఓటర్ల లిస్టు రెడీ : ఏపీలో తొలగించిన ఓట్లు 1 లక్ష 41 వేల 822