Realtor Murder: మా తమ్ముడిని చంపింది మట్టారెడ్డే: శ్రీనివాస్ రెడ్డి సోదరుడు బాల్ రెడ్డి

మంగళవారం 10 టీవీ ప్రతినిధితో మాట్లాడిన బాల్ రెడ్డి.. తన సోదరుడిని హతమార్చింది మట్టారెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Realtor Murder: మా తమ్ముడిని చంపింది మట్టారెడ్డే: శ్రీనివాస్ రెడ్డి సోదరుడు బాల్ రెడ్డి

realtor murder

Updated On : March 1, 2022 / 7:38 PM IST

Realtor Murder: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం ఉదయం జరిగిన రియల్టర్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈఘటనకు సంబంధించి హత్యకు గురైన శ్రీనివాస్ రెడ్డి సోదరుడు బాల్ రెడ్డి.. పలువురిపై అనుమానం వ్యక్తం చేశాడు. మంగళవారం 10 టీవీ ప్రతినిధితో మాట్లాడిన బాల్ రెడ్డి.. తన సోదరుడిని హతమార్చింది మట్టారెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీనివాస్ రెడ్డిని చంపిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని బాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని..శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి స్నేహితులు కాగా.. హఫీజ్, కృష్ణ అనే మరికొందరు కూడా మా తమ్ముడితో కలిసి పనిచేస్తారని బాల్ రెడ్డి తెలిపారు.

Also read: Realtor Murder : కాల్పుల ఘటనలో గాయపడిన రఘు మృతి

ఈక్రమంలో గత మూడు నెలల నుండి వీరికి మట్టారెడ్డితో భూ వివాదం నడుస్తుందని బాల్ రెడ్డి తెలిపారు. లేక్ వ్యూ అసోసియేషన్ సభ్యులతో వివాదం జరిగిందని..రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడంతో శ్రీనివాస్ రెడ్డి పేరు మీద భూమి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉండదని బాల్ రెడ్డి తెలిపారు. అయితే ఇంతలోనే ఇలా జరుగుతుందని తాము ఊహించలేదంటూ బాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.

Also read: Realtor Murder : రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చి రియల్టర్ దారుణ హత్య, మరొకరిపై ఫైరింగ్

మొదట గా శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు..శ్రీనివాస్ రెడ్డి మృతదేహంలో ఎలాంటి బుల్లెట్ లభ్యం కాలేదని నివేదికలో పేర్కొన్నారు. షార్ట్ గన్ తో కాల్పులు జరపడం వలన శ్రీనివాస్ రెడ్డి తలకు బలమై.. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడని నివేదికలో పేర్కొన్నారు. రాఘవేందర్ రెడ్డి మృతదేహంలో ఒక బుల్లెట్ ను గుర్తించారు వైద్యులు. రెండు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు… కేసుపై బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Also read: Husband Harassment : ప్రేమ పెళ్లి-ఆడ పిల్లలు పుట్టారని వదిలేసిన భర్త