Pudding And Mink Pub : పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్  డ్రగ్స్ కేసులో నిందితులు అభిషేక్,అనిల్ కుమార్ ల పోలీసు కస్టడీ ముగియటంతో పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.

Pudding And Mink Pub : పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

Pudding And Mink Pub

Updated On : April 19, 2022 / 7:51 AM IST

Pudding And Mink Pub :  పుడ్డింగ్ అండ్ మింక్ పబ్  డ్రగ్స్ కేసులో నిందితులు అభిషేక్,అనిల్ కుమార్ ల పోలీసు కస్టడీ ముగియటంతో పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హజరు పరిచారు. దీంతో న్యాయ స్ధానం నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులిద్దరినీ పోలీసులు జైలుకు తరలించారు.

బంజారా హిల్స్ పోలీసులు కస్టడీ కన్ఫేషన్ స్టేట్ మెంట్ కోర్టుకు సమర్పించారు. బంజారాహిల్స్ రాడిసన్ బ్లూలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్   కేసులో నిందితుల కస్టడీ ఆదివారంతో ముగిసింది.  బంజారా హిల్స్ పోలీసులు నిందితులను నాలుగు రోజుల పాటు విచారించినా వారి వద్దనుంచి సమచారం రాబట్టలేకపోయారు.

పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు  నిందితుల  నుంచి తెలియదని  మాత్రమే సమాధానం వచ్చింది.  దీంతో పోలీసులకు ఈ కేసును ఒక కొలిక్కి  తీసుకు రావటం కత్తి మీద సాములా తయారయ్యింది. పబ్ పై దాడులు, నిందితుల అరెస్ట్ పబ్ లో డ్రగ్స్ దొరికినప్పటికీ అవి ఏవీ కేసుకు బలాన్నిచ్చేలా  లేకపోటంతో  పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఏప్రిల్ 3న పోలీసులు పబ్ పై దాడి చేసినప్పుడు డెస్క్ మీద ఉన్న ఐదు మిల్లీ గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!