YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!

ఏపీలో అధికార పార్టీకి సంబంధించి మరోసారి నామినేటెడ్ పదవుల జాతర మొదలు కానుంది. ఈ మధ్యనే పాత మంత్రి వర్గాన్ని రద్దు..

YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!

ysrcp

YSRCP: ఏపీలో అధికార పార్టీకి సంబంధించి మరోసారి నామినేటెడ్ పదవుల జాతర మొదలు కానుంది. ఈ మధ్యనే పాత మంత్రి వర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రి వర్గంతో పరిపాలన మొదలు పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మంత్రికి పదవులు ఆశించి అసంతృప్తిలో ఉన్న కొందరు నేతలకు నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవులకు సంబంధించి నేడు తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

YSRCP MPs On Development : సింగపూర్‌లా ఏపీ రాజధాని కట్టాలంటే రూ.2లక్షల కోట్లు కావాలి- వైసీపీ ఎంపీలు

వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంత కీలకంగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి పార్టీలో ఏం జరిగినా అది విజయసాయి అండదండలతోనే అనే టాక్ నడుస్తుంటుంది పార్టీలో. ఇప్పటివరకూ ఉత్తరాంధ్రలో పార్టీని పర్యవేక్షిస్తున్న విజయసాయిని.. ఆ బాధ్యత నుంచి తప్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి మారుస్తారని వినిపిస్తుంది. ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత సాయిరెడ్డికి అప్పగించగా.. ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి మార్చే ఛాన్స్ కనిపిస్తుంది.

TDP vs YSRCP: ఎన్టీఆర్ భవన్‌పై దాడిలో 10 మంది.. పట్టాభి ఇంటిపై దాడిలో 11 మంది అరెస్ట్!

ఇక, విజయసాయి స్థానంలో ఉత్తరాంధ్ర బాధ్యతలను సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. మంగళవారం సీఎం విశాఖ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ పార్టీ బాధ్యతలపై ఫైనల్ రిపోర్ట్, పేర్లు వెలువడనున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమన్వయకర్తల వివరాలు చూస్తే.. తూర్పుగోదావరికి వైవీ సుబ్బారెడ్డి, పశ్చిమగోదావరికి మిథున్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కొడాలి నాని, పల్నాడు జిల్లాకు మోపిదేవిని నియమించే ఛాన్స్ కనిపిస్తుంది.

Ysrcp – NDA: ‘వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం బెటర్’

వీటితో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు, కడప జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించనుండగా.. సజ్జలకు ప్రత్యేకంగా జిల్లా బాధ్యతలు కేటాయించకుండా పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఫైనల్ లిస్ట్ బయటకి వస్తే కానీ ఈ నియామకాలపై స్పష్టత రాదు.