TDP vs YSRCP: ఎన్టీఆర్ భవన్‌పై దాడిలో 10 మంది.. పట్టాభి ఇంటిపై దాడిలో 11 మంది అరెస్ట్!

ఏపీలో రాజకీయ వివాదాలు.. ఘర్షణలు గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరి పరుష దూషణలకు తోడుగా ప్రత్యర్థులతో పాటు వారి ఇళ్లపై కూడా దాడుల వరకు..

TDP vs YSRCP: ఎన్టీఆర్ భవన్‌పై దాడిలో 10 మంది.. పట్టాభి ఇంటిపై దాడిలో 11 మంది అరెస్ట్!

Tdp Vs Jsrcp

TDP vs JSRCP: ఏపీలో రాజకీయ వివాదాలు.. ఘర్షణలు గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరి పరుష దూషణలకు తోడుగా ప్రత్యర్థులతో పాటు వారి ఇళ్లపై కూడా దాడుల వరకు వెళ్లిన ఈ పరుష రాజకీయంలో గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. ఎవరికి వారు దీక్షలకు దిగిన రెండు పార్టీలు ఇప్పుడు ఈ వివాదాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

CBN to Delhi: ఢిల్లీ టూర్‌కు సిద్ధమవుతున్న చంద్రబాబు!

కాగా, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి 10మందిని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. వీరిలో గుంటూరుకు చెందిన ఐదుగురు, విజయవాడకు చెందిన ఐదుగురు ఉండగా అరెస్టయిన వారంతా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అనుచరులుగా గుర్తించారు.

KTR on Eetala Revanth: ఈటల, రేవంత్.. ఓ హోటల్‌లో కలిశారు.. కావాలంటే ఆధారాలు చూపిస్తా: కేటీఆర్

అలాగే దాడికి సంబంధించి పూర్తి సీసీ కెమెరా దృశ్యాలను అందించాలని టీడీపీ కార్యాలయానికి 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని తెలిపిన పోలీసులు.. ఇంకా సీసీ ఫుటేజీ తమకు రాలేదని.. దాని ద్వారా మిగతా ముద్దాయిలను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఇక, అదేరోజు టీడీపీ నేత పట్టాభిరాం నివాసంపై జరిగిన దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ గుణదల, క్రీస్తురాజపురం, బావాజీపేట, ఉడ్‌పేట, సీతారామపురం వాసులున్నారు.

AP Politics: చంద్రబాబు దీక్షపై.. టీడీపీ, వైసీపీ డైలాగ్ వార్..!

విచారణలో భాగంగా సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, నేరం జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటివరకు 11 మంది నిందితులను గుర్తించామని పోలీసులు పేర్కొనగా.. దాడి ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 148, 427, 452, 506, 149 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పటమట పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 11 మంది నిందితులను అరెస్టు చేసి వారికి నోటీసులు ఇచ్చామన్నారు.