KTR on Eetala Revanth: ఈటల, రేవంత్.. ఓ హోటల్‌లో కలిశారు.. కావాలంటే ఆధారాలు చూపిస్తా: కేటీఆర్

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.

KTR on Eetala Revanth: ఈటల, రేవంత్.. ఓ హోటల్‌లో కలిశారు.. కావాలంటే ఆధారాలు చూపిస్తా: కేటీఆర్

Ktr (1)

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నేతలు ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి.. ఓ హోటల్ లో కలిశారని.. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈటల.. రేవంత్ కలుసుకోలేదని చెబితే.. తానే ఆధారాలను రిలీజ్ చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. హోటల్ సిబ్బంది దగ్గరి నుంచే తనకు సమాచారం వచ్చిందని చెప్పారు.

ఇలాంటి చర్యలను ప్రజలు తిప్పికొడతారన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకే.. ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందాన్ని చేసుకున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం వైఖరిపైనా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిధిని మించి ఈసీ వ్యవహరిస్తోందని.. ఎన్నికల నియమావళిని పక్క జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తుందేమో.. అని కామెంట్ చేశారు. మరోవైపు.. హైదరాబాద్ లోని హైటెక్స్ లో.. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుందని.. ఆహ్వానించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.

హాజరయ్యేవారు.. గులాబీ రంగు చొక్కాలు, చీరల డ్రెస్ కోడ్ పాటించాలని కేటీఆర్ చెప్పారు. ఫస్ట్ సెషన్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక, రెండో సెషన్ లో తీర్మానాలు.. అధ్యక్షుడి సందేశం ఉంటాయని చెప్పారు. 7 అంశాలపై తీర్మానాలు పెడతామని.. కేంద్రం తీరుపైనా తమ వైఖరి తెలియజేస్తామని అన్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఈటల.. అని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు కచ్చితంగా ఆ రెండు పార్టీల పన్నాగాలను తిప్పికొట్టడం ఖాయమని తేల్చి చెప్పారు.. కేటీఆర్.