Father Suicide : తీవ్ర విషాదం.. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కొడుకు ఆకస్మిక మరణం తట్టుకోలేకపోయిన ఆ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే ఇంట్లోనే ఫ్యాన్ కి..

Father Suicide
Father Suicide : హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొడుకు ఆకస్మిక మరణం తట్టుకోలేకపోయిన ఆ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరు లక్ష్మణ్(35). స్థానిక అంబేద్కర్ నగర్‌లో భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నాడు.
Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు
కాగా, ఏడేళ్ల కొడుకు కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న మరణించాడు. కొడుకు మృతిని లక్ష్మణ్ తట్టుకోలేకపోయాడు. కొడుకు అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.