Tirupati : రైలు పెట్టెలో మృతదేహం లభ్యం

తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం నుండి తిరుపతికి చేరిన రైలులోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.

Tirupati : రైలు పెట్టెలో మృతదేహం లభ్యం

unknown dead body

Updated On : June 12, 2022 / 6:21 PM IST

Tirupati :  తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం నుండి తిరుపతికి చేరిన రైలులోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ప్రయాణికులు అందరూ దిగిన తర్వాత బోగీని శుభ్రం చేయటానికి వెళ్లిన పారిశుద్ధ కార్మికులు మృతదేహాన్ని గుర్తించి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తిరుపతి రైల్వే స్టేషన్ అధికారుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని  మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

Also Read : UP violence: యూపీ అల్లర్లు.. ప్రయాగరాజ్‌లో 304మంది అరెస్ట్