UP violence: యూపీ అల్లర్లు.. ప్రయాగరాజ్‌లో 304మంది అరెస్ట్

బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై దేశంలోని పలు చోట్ల దుమారం చెలరేగుతుంది. ఆ కామెంట్లతో అంత‌ర్జాతీయంగా భారత్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దేశంలోని ముస్లిం వ‌ర్గాలు నూపుర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయాల‌ని, ఉరిశిక్ష విధించాలంటూ నిర‌స‌న‌ల‌ు వ్యక్తం చేస్తున్నారు.

UP violence: యూపీ అల్లర్లు.. ప్రయాగరాజ్‌లో 304మంది అరెస్ట్

Up Violence

UP violence: బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై దేశంలోని పలు చోట్ల దుమారం చెలరేగుతుంది. ఆ కామెంట్లతో అంత‌ర్జాతీయంగా భారత్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దేశంలోని ముస్లిం వ‌ర్గాలు నూపుర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయాల‌ని, ఉరిశిక్ష విధించాలంటూ నిర‌స‌న‌ల‌ు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం జరిగిన ఆందోళనలు పలు హింసాత్మ‌కంగా ఘటనలకు తెరదీశాయి.

ఈ ఘటనల్తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు 300 మందికి పైగా నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రంలోని 8జిల్లాల నుండి 304 మందిని అరెస్టు చేశామని, దీనికి సంబంధించి 9 జిల్లాల్లో 13 కేసులు నమోదయ్యాయి” అని వెల్లడించారు.

ప్రయాగ్‌రాజ్‌లో 91 మందిని, సహరాన్‌పూర్‌లో 71 మందిని, హత్రాస్‌లో 51 మందిని, అంబేద్కర్ నగర్, మొరాదాబాద్‌లో ఒకొక్కరు 34 మందిని, ఫిరోజాబాద్‌లో 15 మందిని, అలీఘర్‌లో ఆరుగుర్ని, జలౌన్‌లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు కుమార్ తెలిపారు.

Read Also: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్

వీటితో పాటుగా 13 కేసులలో, ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లో ఒక్కొక్కటి 3 కేసులు, ఫిరోజాబాద్, అంబేద్కర్ నగర్, మొరాదాబాద్, హత్రాస్, అలీగఢ్, లఖింపూర్ ఖేరీ, జలౌన్‌లలో ఒక్కొక్కటి నమోదైనట్లు సీనియర్ అధికారి తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పాలనలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తోన్న నిర‌స‌న‌కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కొన్ని రోజులుగా పలు నగరాల్లో అస్తవ్యస్తమైన పనులకు పాల్పడిన సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నాగరిక సమాజంలో సంఘ వ్యతిరేక వ్యక్తులకు చోటు లేదు. అదే సమయంలో ఒక్క దోషిని కూడా విడిచిపెట్టకూడదు” అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లో ఆందోళనకారులు మోటార్‌సైకిళ్లను, బండ్లను తగులబెట్టి.. పోలీసు వాహనాన్ని తగులబెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించి ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.