Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద అనుమనాస్పద వ్యక్తి అరెస్ట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ సీఐ సురేష్ చెప్పారు. 

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద అనుమనాస్పద వ్యక్తి అరెస్ట్

Raghu Rama Krishna Raju

Updated On : July 5, 2022 / 2:23 PM IST

Raghu Rama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ సీఐ సురేష్ చెప్పారు.  సోమవారం  ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఎంపీ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న ఎంపీ అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది బాషాను తమకు అప్పచెప్పారని అన్నారు.

కాగా తాను ఏపీ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన అధికారిగా అతను చెప్పాడని ఆయన అన్నారు. పోలీసులు వచ్చి బాషాను అదుపులోకి తీసుకునే లోపలే ఎంపీ అనుచరులు, సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది బాషాను చితకబాదారని… బాషా వాడిన బైక్ కు నెంబర్ ప్లేట్ లేకపోవటంతో అనుమానం వచ్చి కొట్టినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెప్పారని సీఐ సురేష్ అన్నారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రాణ హాని ఉన్నదృష్ట్యా .. అనుమానం గా తిరుగుతున్న బాషాను కొట్టినట్లు తెలుస్తోంది. కాగా ఏపీ ఇంటిలిజెన్స్ అధికారి బాషా, రఘురామకృష్ణ రాజు  ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులు నమోదు చేసుకున్న గచ్చిబౌలీ పోలీసులు IPC సెక్షన్  365,322,504,506 ల కింద కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా  కేసు దర్యాప్తు చేస్తున్నామని సురేష్ తెలిపారు.