మరో అమానుషం : అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేసే ప్రయత్నం

దిశ ఘటన మరవకముందే మరో అమానుషం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలిపై సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. లక్నోకి సమీపంలోని ఉన్నావ్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
కొన్ని నెలల క్రితం..ఉన్నావ్‌లో నివాసం ఉండే యువతిపై అత్యాచారం జరిగింది. తర్వాత బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఫిర్యాదు చేసిన యువతిపై కక్ష పెంచుకున్నాడు. రేప్ కేసులో విచారణకు హాజరై..రాయ్ బరేలి నుంచి యువతి వస్తోంది. ఉన్నావ్ గ్రామ శివారుకు చేరుకున్న యువతిపై ఒక్కసారిగా నిందితుడు..అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
పెట్రోల్ పోసి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు 80 శాతానికి మేర కాలిపోయింది. లక్నోలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. యూలో శాంతిభద్రతలు దిగజారిపోవడానికి ఇదే ఉదాహరణ అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి అమీత్ షాతో పాటు..యూపీ సీఎందే బాధ్యత అన్నారు ప్రియాంక.
Read More :