Woman Body in Suitcase : సూట్ కేసులో యువతి శవం .. తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
సూట్ కేసులో యువతి శవం లభ్యం కావటంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసారు.

Woman Body in Suitcase
Woman Body in Suitcase : కడుపున పుట్టిన బిడ్డలను ముఖ్యంగా ఆడపిల్లలను ‘పరువు’గా భావించే ఈ సమాజంలో ‘పరువు’పేరుతో హత్యలు జరుగుతునే ఉన్నాయి. కూతురు తనకు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ‘పరువు’పోయిందని మరి ముఖ్యంగా ఇతర కులానికి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ‘పరువు’తీసిందనే భావన సమాజంలో నాటుకుపోయింది. అందుకే పరువు పేరుతో హత్యలు కొనసాగుతున్నాయి. గుండెల మీద పెట్టుకుని పెంచిన ఆడబిడ్డను పరువుగా భావించే తల్లిదండ్రులు పాశవికంగా హత్యలు చేయటానికి కూడా వెనుకాడటంలేదు. అటువంటిదే జరిగింది యూపీ మరో ‘పరువు’పేరుతో హత్య. కన్నకూతున్ని దారుణంగా చంపేసి ఓ సూట్ కేస్ లో పెట్టి అవతలపారేశాడు. ఏదో చెత్తను పారేసినట్లు..మరి కూతుర్ని చంపేస్తే పోయిన ‘పరువు’తిరిగిస్తుందా? ఈ ప్రశ్న పరువు పేరుతో హత్యలు చేసేవారు ఆలోచిస్తున్నారా? అంటే వారికి సమాధానం లభిస్తుందా? ఇటువంటి ప్రశ్నలు వారికి అవసరం లేదు.
కులాంతర వివాహం చేసుకున్న కూతుర్ని చంపేసి పారేసిన తండ్రి మాత్రం మనశ్శాంతిగా ఉంటాడా? అంటే అదీ లేదు. ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుంది. అదే జరిగింది యూపీలో జరిగిన మరో పరువు హత్య విషయంలో. కూతుర్ని చంపేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు భర్త జైలు పాలయ్యాడు. ఇటు కన్న కూతురు కన్నవారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయి ‘పరువు’ హత్య పేరుతో నడిరోడ్డుమీద శవంలా పడి ఉంది. ఇక ఆ తల్లి పరిస్థితి ఏంటీ? అంటే సమాధానం దొరకని ప్రశ్న..ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కూతుర్ని చంపటానికి భర్తకు భార్య సహకరించటం..
ఉత్తరప్రదేశ్ లో ఓ తండ్రే తన కుమార్తెను కిరాతకంగా హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసు పడి ఉంది. దానిని చూసిన కొంతమంది ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్లగా, రక్తపు మరకలు ఉండడంతో భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
ఇది హత్య కేసుగా భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ఆయుషి చౌదరి అని తండ్రే హత్య చేసాడని తేలింది. మరో సామాజిక వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే యువకుడ్ని ప్రేమించి వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రి నితీష్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు. భార్యసాయంతో కుమార్తె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద పడేశారు.ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు సీసీ టీవీ ఫుటేజితో పాటు ఫోన్ డేటాను పరిశీలించి తండ్రి నితీష్ యాదవ్ ను హంతకుడిగా నిర్ధారించారు. అతడి నుంచి లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ‘పరువు’హత్యగా నిర్ధారణ అయ్యింది.