Woman Tied To Tree : తెలియని పురుషుడితో మాట్లాడిందని మహిళను చెట్టుకు కట్టేసి…..

గ్రామానికి వచ్చిన అపరిచిత వ్యక్తితో మాట్లాడిందని మహిళను అత్తింటివారు చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది.

Woman Tied To Tree : తెలియని పురుషుడితో మాట్లాడిందని మహిళను చెట్టుకు కట్టేసి…..

Up Police

Updated On : September 28, 2021 / 7:43 PM IST

Woman Tied To Tree : గ్రామానికి వచ్చిన అపరిచిత వ్యక్తితో మాట్లాడిందని మహిళను అత్తింటివారు చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళ అత్తింటి వారు ఇద్దరినీ చెట్టుకు కట్టేసి తీవ్రంగా వేధించారు.

ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ కు చెందిన వ్యక్తికి, ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అహ్మగాబాద్ గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. వారం రోజుల క్రితం తన పొలం పనుల నిమిత్తం ఆయన గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తనకు ఎదురుపడిన మహిళతో మాట్లాడాడు. ఈ దృశ్యాన్ని ఆ మహిళ అత్తింటివారు చూశారు.

వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరినీ గ్రామస్తుల సహాయంతో ఊర్లోని చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పినా వినకుండా ఇద్దరినీ కొట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరినీ విడిచి పెట్టారు.
Also Read : Woman Shower Filming : మహిళా పోలీసు అధికారి బాత్రూం వీడియో…రూ. 5 లక్షలకు బేరం పెట్టిన డ్రైవర్
ఈక్రమంలో ఉత్తరాఖండ్ కు చెందిన వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన పోలీసులు మహిళ ఇంటిలోని 12 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.