Rajasthan : తల్లిదండ్రులను చంపేసిన బాలుడు.. కారణం తెలిస్తే షాక్!

అలవాటు మానకపోయేసరికి..తల్లిదండ్రులు అతడిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపారు. కొద్దిరోజుల అనంతరం ఇంటికి చేరుకున్నాడు. మరలా డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు

Rajasthan : తల్లిదండ్రులను చంపేసిన బాలుడు.. కారణం తెలిస్తే షాక్!

Rajasthan

Updated On : December 17, 2021 / 11:50 AM IST

Rajasthan  : డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కు పంపినందుకు తల్లిదండ్రులపై కక్ష పెట్టుకుని వారిని దారుణంగా చంపేశాడు. 47 ఏళ్ల తండ్రి, 38 ఏళ్ల తల్లిని నిద్రలోనే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అతడిని పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. హనుమాన్ ఘర్ లో నోహార్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎస్ హెచ్ వో రవీంద్ర సింగ్ వివరాలను వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు 16 ఏళ్ల బాలుడు బానిసయ్యాడు.

Read More : Anasuya : మీరు ఎప్పటికీ టైగర్‌ దర్శన్‌ పెహెల్వానే.. తండ్రిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ

అలవాటు మానకపోయేసరికి..తల్లిదండ్రులు అతడిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపారు. కొద్దిరోజుల అనంతరం ఇంటికి చేరుకున్నాడు. మరలా డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు. ఈ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మరోసారి అక్కడకు పంపుతారని బాలుడు గుర్తించారు. దీంతో నిద్రపోతున్న తల్లిదండ్రులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రక్తపుమడుగులో వారు అక్కడికక్కడనే చనిపోయారు. తల్లిదండ్రులను రక్షించేందుకు బాలుడి తమ్ముడు ప్రయత్నించారు. అతడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అనంతరం తాను తల్లిదండ్రులను హత్య చేసినట్లు గ్రామస్తులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని…బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.