Minor Girl Raped : దారుణం.. ఇంటి బయట ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికపై అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలు అని కూడా చూడటం లేదు.

Minor Girl Raped : దారుణం.. ఇంటి బయట ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికపై అత్యాచారం

Updated On : July 15, 2021 / 5:38 PM IST

Uttar Pradesh Minor Girl Raped Lakhimpur Kheri Cousin Arrested: నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలు అని కూడా చూడటం లేదు. అభంశుభం తెలియని పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.

లైంగిక దాడి తర్వాత ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించాడు. నిందితుడికి భార్య కూడా ఉంది.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. పిల్లలను ఒంటరిగా వదిలేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన చెబుతోంది. వారిని ఒంటరిగా వదిలేయడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.