Man Attack Girl For Calling Uncle : అయ్యాయ్యో.. నన్ను అంకుల్ అంటావా? అంటూ యువతిపై వ్యక్తి దాడి

ఓ యువతి తనను అంకుల్ అని పిలిచినందుకు అతడు కోపంతో ఊగిపోయాడు. నన్ను అంకుల్ అంటావా? అంటూ శివాలెత్తాడు. ఆ అమ్మాయిపై దాడి చేశాడు.

Man Attack Girl For Calling Uncle : అయ్యాయ్యో.. నన్ను అంకుల్ అంటావా? అంటూ యువతిపై వ్యక్తి దాడి

Man Attack Girl For Calling Uncle

Updated On : December 25, 2021 / 7:49 PM IST

Man Attack Girl For Calling Uncle : తమ కంటే వయసులో కాస్త పెద్ద వాళ్లను(మగవాళ్లను) అన్నా అనో, అంకుల్ అనో పిలవడం కామన్. అందులో తప్పేమీ లేదని మీరనొచ్చు. మీ సంగతి అటుంచితే… ఓ యువతి తనను అంకుల్ అని పిలిచినందుకు అతడు కోపంతో ఊగిపోయాడు. నన్ను అంకుల్ అంటావా? అంటూ శివాలెత్తాడు. ఆ అమ్మాయిపై దాడి చేశాడు.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో దుకాణదారుడిని(35).. అంకుల్‌ అని పిలిచినందుకు 18ఏళ్ల యువతిపై దాడికి దిగాడు. దారుణంగా కొట్టాడు. ఆ యువతి పేరు నిషా అహ్మద్‌. వ్యక్తి దాడిలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.

పట్టణంలోని ఖతిమా రోడ్ లో మోహిత్ కుమార్ (35) జ‌న‌ర‌ల్ స్టోర్ నిర్వ‌హిస్తున్నాడు. యువతి అతడి షాపులో డిసెంబర్ 19న బ్యాడ్మింటన్ రాకెట్ కొనింది. దాంతో బ్యాడ్మింట‌న్ ఆడుతుండ‌గా బ్యాట్ రాకెట్ తీగ‌లు తెగిపోయాయి. దీంతో ఆ బ్యాట్ ని మార్చుకోవడానికి యువతి.. మోహిత్ కుమార్ షాప్‌ కి వెళ్లింది. మోహిత్ కుమార్‌ను యువతి అంకుల్ అని పిలిచింది.

Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

అంతే, మోహిత్‌ కుమార్ కు పట్టరాని కోపం వచ్చింది. నన్ను అంకుల్ అంటావా అంటూ ఊగిపోయాడు. ఆవేశం ఆపుకోలేక ఆ అమ్మాయిని దారుణంగా కొట్టాడు. అతడి తీరుతో యువతి విస్తుపోయింది. కాగా, ఈ దాడిలో గాయపడిన బాధితురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను సైతం షాక్ కి గురి చేసింది. మోహిత్ తీరుని అంతా తప్పుపడుతున్నారు. అంకుల్ అని పిలవడం నేరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత చిన్న విష‌యానికే అంత దారుణంగా కొట్టాలా? అంటూ మోహిత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.