Vellore SP Chased Thiefs : దోపిడీ చేసి పారిపోతున్న దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న వెల్లూరు ఎస్పీ
దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్వయంగా జిల్లా ఎస్పీ వెంటాడి పట్టుకున్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది.

Vellore Sp Chase Thiefs
Vellore SP Chased Thiefs : దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్వయంగా జిల్లా ఎస్పీ వెంటాడి పట్టుకున్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి స్ధానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగం సినిమాలో హీరో లాగా ఎస్పీ దొంగను పట్టుకోటానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు.
వివారాల్లోకి వెళితే….. పల్లికొండకు చెందిన సతీష్ వెల్లూరు గ్రీన్ సర్కిల్ వద్ద టాటూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. సాళవన్ ప్రాంతానికి చెందిన కిషోర్, అతడి ఇద్దరు స్నేహితులు కత్తులతో బెదిరించి సతీష్ వద్ద ఉన్న డబ్బు దోచుకున్నారు. అనంతరం బైక్‌పై పరారయ్యారు. సతీష్ వాళ్లను వెంబడించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ ఈ దృశ్యం చూశాడు. సతీష్‌ను అడిగి వివరం తెలుసుకున్నాడు. పారిపోతున్న దొంగల బైక్ ను వెంటాడాలని డ్రైవర్‌ను ఆదేశించారు.
అయితే పోలీసు వాహానాన్ని చూసిన దొంగలు బైక్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బైక్ పైనుంచి కింద పడ్డారు. వారిలో ఒకడు తేరుకుని వెంటనే బైక్ తీసుకుని పారిపోయాడు. మరో ఇద్దరు దొంగలు పరుగు లంకించుకున్నారు. జీపు వెళ్లేందుకు అవాకశం లేని చిన్స చిన్న సందుల్లో దూరి తప్పించుకోవటం మొదలెట్టారు. దీంతో ఎస్పీ కూడా జీపు దిగి వారిని వెంబడించి నిందితులను పట్టుకున్నారు.
Also Read : Tungabhadra Flood Water : నిండు కుండలా మారిన తుంగభద్రా నది
వారి వద్దనుంచి రూ.1,200 నగదు సెల్ ఫోన్,కత్తి, కొడవలి, స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మరో నిందితుడిని ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అరెస్ట్ చేషారు. దొంగలను పట్టుకోవటంలో చొరవ చూపించిన ఎస్పీని, ఇతర పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు….కాగా ఈ కేసులో నిందితులంతా మైనర్లుగా గుర్తించారు.