New Born Baby : అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన కసాయితల్లి
విజయవాడ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.

Just Born Baby
New Born Baby : విజయవాడ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.
చిట్టినగర్ వాగు సెంటర్‌లో రోడ్డు పక్కన పడేసిన నవజాత శిశువుకు చీమలు కుట్టటంతో ఏడ్చింది. ఏడుపు విన్న స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు గాయాలతో ఉన్న శిశువును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.