మా ఆయనకు అమ్మాయిల పిచ్చి.. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు..
తన భర్త వుమనైజర్ అని, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించారు.

Vizag woman: తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రబుద్దుడిని వైజాగ్ లో ఓ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్త మరో యువతితో సన్నిహితంగా ఉండగా పోలీసులకు, మీడియాకు పట్టిచ్చింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న తన భర్తకు తగిన శిక్ష విధించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ మిస్ వైజాగ్ నక్షత్ర బుధవారం 10టీవీతో మాట్లాడుతూ.. తన భర్త వెంకటసాయి తేజకు అమ్మాయిల పిచ్చి ఉందని, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించారు. క్లబ్ హౌస్ డేటింగ్ యాప్‌లో కనెక్ట్ అయిన రాజమండ్రి అమ్మాయిని భార్య అని చెప్పుకుని తిరుగుతున్నాడని తెలిపారు. అతడితో తాను కలిసుండాలని అనుకోవడం లేదని, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న అతడికి తగిన శిక్ష పడాలని నక్షత్ర అన్నారు.
Also Read: 14 పేజీల సూసైడ్ లేఖ రాసి.. యువతి బలవన్మరణం.. ఎంతగా వేధించాడో?
”2015లో మా ఇద్దరికీ పెళ్లయింది. మాది లవ్ మ్యారేజ్, మాకో పాప కూడా ఉంది. గత కొంతకాలంగా తన బ్రిహేవియర్‌లో చాలా ఛేంజెస్ ఉన్నాయి. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. అది తెలుసుకుని గట్టిగా అడిగేసరికి పెద్దపెద్ద గొడవలయ్యాయి. ఇంకా గట్టిగా అడిగేసరికి నా చేయి కాల్చేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి మళ్లీ ఇంటికి రాలేదు. రోజుకొక ఎఫైర్ గురించి తెలుసుకుంటున్నాను. అలా బాధ పడుతూనే ఉన్నాను. రీసెంట్ గా ఓ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వైఫ్ అని చెప్పుకుని దస్పల్లాహిల్స్ లో ఉంటున్నాడని తెలిసింది. ఎక్కడా నాకు న్యాయం జరగట్లేదని మీడియా సపోర్ట్ తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకున్నాం. మీడియా ముందు ఈమె నా భార్య అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నాకు డివోర్స్ ఇవ్వకుండా ఆ అమ్మాయిని పెళ్లెలా చేసుకుంటాడు? ఆ అమ్మాయి కూడా నీ అంతు తేలుస్తానని మీడియా ముందే నన్ను బెదిరించింది. ఆమెది రాజమండ్రి అంట, పొలిటిషియన్ కూతురురంటా. మీరేం పీక్కుంటారో పీక్కోండి అంటోంది.
Also Read: ఛీ..ఛీ.. స్కానింగ్ సెంటర్‌లో ఆపరేటర్ వికృత చేష్టలు.. మహిళల ఫొటోలు, వీడియోలు తీసి..
సినిమా తీస్తానని నా బంగారమంతా తాకట్టు పెట్టేశాడు. ఇంట్లో సామానంతా అమ్మేశాడు. జాబ్ నుంచి అతడిని సస్పెండ్ చేశారు. నేవీ డక్‌యార్డ్‌లో ఛార్జ్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడ సస్పెండ్ చేసేస్తే 40 వేల రూపాయల రెంటెడ్ హౌస్ లో ఎలా ఉంటున్నాడు? మా మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం పబ్జీ గేమ్. రాత్రంతా మేలుకుని పబ్జీ గేమ్ ఆడుకోవడం, దరిద్రంగా మాట్లాడుకోవడం.. తెలవారితే ఆఫీసుకు వెళ్లకుండా పడుకునేవాడు. నేను అడిగితే నాతో గొడవ పడేవాడు. 2020 నుంచి మా మధ్య గొడవలు మొదలయ్యాయి. 2021లో తన ఎఫైర్లు అన్నీ నాకు తెలిసిపోయాయి. వాడు వుమనైజర్, ఆ బుద్ధులున్నాయి. ఇలాంటి కామాంధుడికి శిక్ష పడాలి. నేనైతే అతడితో కలిసుండను. ఇలాంటివాడితో కలిసుంటే రేపు నా కూతురికి కూడా ప్రమాదమే. అలాంటోడికి కచ్చితంగా శిక్ష పడాల”ని నక్షత్ర అన్నారు.