ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఇల్లాలు

ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఇల్లాలు

Updated On : February 17, 2021 / 8:21 PM IST

wife kills husband with help from paramour, lodges false missing complaint to evade suspicion : హర్యానాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం మోజులో ఒక ఇల్లాలు భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పైగా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. కొద్దిరోజులనుంచి కవిపించటంలేదని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

హర్యానాలోని యమునా నగర్, ఖిజ్రాబాద్ ప్రాంతంలో తిలక్ రాజ్ (26) అతని భార్య పాలోదేవితో కలిసి నివసిస్తున్నాడు. అతను రాజ్ బల్లెవాలా క్రషర్ జోన్ లో కూలీగా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో జనవరి 15 వ తేదీ నుంచి తిలక్ రాజ్ కనిపించకుండా పోయాడు.

పాలోదేవి జనవరి 22వ తేదీన పార్తావ్ నగర్ పోలీసు స్టేషవ్ కు వెళ్లి గతవారం రోజులుగా తన భర్త కనిపించటంలేదని ఫిర్యాదు చేసింది.తన భర్త మాదక దవ్ర్యాలకు అలవాటు పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారిస్తుండగా తిలక్ రాజ్ సోదరి, ఆమె భర్త పాలోదేవి పై అనుమానం వ్యక్తం చేసారు. దేవీ ఆమె ప్రియుడు సోహైల్ ఖాన్ తో కలిసి తన అన్నను హత్యచేసిందని చెప్పింది. పోలీసులు దేవీని విచారించగా సోహైల్ ఖాన్ పేరు బయట పెట్టింది.సోహైలా ఖాన్ ను పోలీసులుఅరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించగా నిందితులిద్దరూ నేరం ఒప్పుకున్నారు.

తిలక్ రాజ్, పాలోదేవిలకు నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె పుట్టింది. తిలక్ రాజ్ క్రషర్ లో కూలీగా పనికి వెళ్లిన సమయంలో దేవీకి ఇంటి సమీపంలోని సోహైల్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేపి అక్రమ సంబంధానికి దారితీసింది.

తిలక్ రాజ్ ను తప్పిస్తే   తామిద్దరం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయవచ్చనుకున్న నిందితులిద్దరూ ఒకరోజు తిలక్ రాజ్ ను,  తాడు  గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వారి ఇంటి వరండాలోనే  గొయ్యితీసి పూడ్చిపెట్టారని  పార్తావ్ నగర్ ఎస్సై బలరాజ్ సింగ్ వివరించారు.