నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

  • Published By: chvmurthy ,Published On : March 13, 2020 / 02:57 AM IST
నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

Updated On : March 13, 2020 / 2:57 AM IST

వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు…ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందరూ…ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. నిద్ర పోతున్నమొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి  హతమార్చింది ఓ ఇల్లాలు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఇల్లెందు పట్టణంలోని వినోబా కాలనీలో నివాసం ఉండే నక్కా కళ్యాణ్(28) కొ్న్నేళ్ల కిందట మండలంలోని నిజాంపేటకు చెందిన శైలజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా ఉన్న జంట కొద్ది కాలానికే గొడవలు పడసాగారు. విషయం తెలిసిన ఇరువైపులా పెద్దలు ఇద్దరినీ కూర్చో పెట్టి సర్ది చెప్పి పంపించారు.అయినా వారిమధ్య గొడవలు తగ్గలేదు. 

భర్త కళ్యాణ్ ను అంతమొందించాలనుకుంది భార్య శైలజ. ఊరంతా ఘాడ నిద్రలో ఉంది. మార్చి10 మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిద్రపోతున్నకళ్యాణ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక కళ్యాణ్ అరుస్తూ బయటకు పరుగులు పెట్టాడు. శైలజకూడా అరుస్తూ కేకలు వేసింది. వీరి అరుపులకు నిద్రలేచిన స్ధానికులు మంటలు ఆర్పేశారు.  (మద్యం మత్తులో స్నేహితుడి గొంతుకోసి చంపేశాడు)

బాధితుడిని  వెంటనే ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  పరిస్ధితి విషమించటంతో గురువారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్సపొందుతూ రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశాఢు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల శైలజను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.