Wife Protest : కాపురానికి తీసుకు వెళ్లలేదని భర్త ఇంటిముందు భార్య నిరసన
ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం తో పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఆర్య సమాజంలో మూడు ముళ్ళ బంధంతో ఏకమయ్యారు.

Wife protest
Wife Protest : ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం తో పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఆర్య సమాజంలో మూడు ముళ్ళ బంధంతో ఏకమయ్యారు. కలిసి నడవాల్సిన జీవితంలో… భర్త కాపురానికి తీసుకెళ్ళకుండా ఒంటరిగా భార్యను వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు 25 రోజులుగా అత్తారింటి ముందు న్యాయం కోసం భీష్మించుకుని కూర్చుంది.
ఓ వైపున చలి వణుకుపుట్టిస్తున్నా అవేమి లెక్క చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకే ఆలిగా ఉంటానంటూ భీష్మించుకుని కూర్చుంది ఈ మహిళ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రోజులకు పైగా అత్తారింటి ముందు కూర్చుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధితురాలు సుహాసిని.
వివరాల్లోకి వెళితే…… కడప జిల్లాకు చెందిన సుహాసినికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్‌రెడ్డి 2011 ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఇద్దరు పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటైనప్పటికి సుజిత్‌రెడ్డి కుటుంబం సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో 2020 నవంబర్ 25న సుహాసిని-సుజిత్ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.
అయితే కుటుంబ సభ్యులను ఒప్పించి కాపురానికి తీసుకువెళతా అని చెప్పిన సుజిత్…సుహాసినిని వదిలేసి వెళ్ళిపోయాడు. మాయ మాటలతో ఏడాది గడిచిపోయింది కానీ…. భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. భర్తతో కలిసి ఉండడానికి నవంబర్ 26న హుజురాబాద్ లోని భర్త ఇంటికి వచ్చింది. ఇంట్లోకి పిలిచి కుటుంబ సభ్యులు తన పై దాడి చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది.
తల్లిదండ్రులు మరణించడం తో సుహాసిని ఒంటరి అయ్యింది. ఆదరించాల్సిన భర్త ముఖం చాటేశాడు. కాపురానికి వచ్చిన కోడలిని బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు అత్తింటి వారు. గేటు వద్ద కూర్చుకొని భర్త కోసం ఎదురు చూస్తోంది అభాగ్యురాలు. సుజిత్ కుటుంబ సభ్యుల నుంచి చంపుతానని బెదిరింపులు వస్తున్నా… భర్త కోసం ఎదురుచూస్తోంది.
Also Read : Maoists : మాజీ సర్పంచ్‌ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
2018లో కువైట్ లో ఉన్న తనను ఇండియాకు రప్పించి వివాహం చేసుకుంటామని చెప్పి రప్పించారని బాధితురాలు చెప్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలపోయిన నన్ను అత్తింటి వారు ఆదరించడం లేదని సుహాసిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. గత 25 రోజులుగా అత్తావారింటి ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నా కనికరించడం లేదు అంటుంది. ఇక చలిలో న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలికి కొన్ని రోజుల పాటు ఇరుగు పొరుగు వారు ఆహార పానీయాలు అందించారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సుజిత్ రెడ్డి… వాటిలో ఎవరు సహకరిస్తున్నారో చూస్తూ…వారిని బెదిరిస్తుండడంతో…సుహాసినికి సాయం అందించే వారు లేకుండా పోయారు.
గతంలో తనను కాపురానికి తీసుకెల్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని అయితే అత్తింటి వారు మాత్రం తనను పట్టించుకోవడం లేదని బాధితురాలు చెప్తోంది. ప్రేమ వివాహం జరుగుతుందన్న కారణంగా కువైట్‌లో ఉద్యోగం వదులుకుని వస్తే భర్త తనకు ఏ మాత్రం సహకరించడం లేదని, తనకు న్యాయం జరగలేదన్న కారణంగా క్రిమినల్ కేసు నమోదు చేశానని అయినప్పటికీ అత్తింటి వారి నుండి స్పందన రాలేదన్నారు. దీంతో కాపురానికి తీసుకెళ్లాలని వేడుకుంటూ అత్తింటి ముందు నిరసన తెలుపుతోంది.