Boyfriend Beaten Up : 13 ఫ్రాక్చర్లు, 17 రోజులుగా ఆసుపత్రిలోనే.. అందుకు ఒప్పుకోలేదని ప్రియుడిని దారుణంగా కొట్టించిన ప్రియురాలు..

తన ప్రాణాలను కాపాడుకునేందుకు గుల్షన్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నాడు.

Boyfriend Beaten Up : 13 ఫ్రాక్చర్లు, 17 రోజులుగా ఆసుపత్రిలోనే.. అందుకు ఒప్పుకోలేదని ప్రియుడిని దారుణంగా కొట్టించిన ప్రియురాలు..

Updated On : April 15, 2025 / 6:08 PM IST

Boyfriend Beaten Up : తన ప్రియుడిని ప్రియురాలే చితక్కొట్టించింది. తన కుటుంబసభ్యులతో అతడిపై దాడి చేసింది. వారు ఆ వ్యక్తిని ఎంత తీవ్రంగా కొట్టారంటే.. అతడికి శరీరంలో 13 చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అంతేకాదు 17 రోజులుగా ఆసుపత్రిలో బెడ్ పై పడి ఉన్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

ప్రియురాలు తన ప్రియుడిని కొట్టించడానికి కారణం ఏంటంటే.. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడమే. తన పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అతడిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన అమ్మాయి తన కుటుంబసభ్యులతో అతడిపై దాడి చేయించింది.

బాధితుడి పేరు గుల్షన్. అతడికి ఇది వరకే పెళ్లైంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడు భార్యకు దూరంగా ఉంటున్నాడు. గుల్షన్ మొబైల్ షాప్ ని నడిపిస్తున్నాడు. 2019లో ఓ మహిళ అతడి షాప్ కి వచ్చింది. గుల్షన్ ని పరిచయం చేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2019 నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ మహిళకు కూడా ఇదివరకే పెళ్లైంది. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటోంది. అతడితో విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Also Read : యాస్మిన్ భానుకి ఏమైంది? 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి..

గుల్షన్, ఆ మహిళ బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో అతడు ఆమెకు 21లక్షలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని గుల్షన్ ఆమెను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అయితే, అందుకు గుల్షన్ నిరాకరించాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పాడు.

ఈ క్రమంలో … నీ డబ్బు నీకు తిరిగి ఇస్తాను, నా ఇంటికి రా అని పిలిచింది. ఆమె మాటను గుడ్డిగా నమ్మేసిన గుల్షన్..ఆమె చెప్పినట్లే ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పటికే మహిళ ఆమె కుటుంసభ్యులు అక్కడ రెడీగా ఉన్నారు. గుల్షన్ రాగానే అతడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. అతడిని ఎంత దారుణంగా కొట్టారంటే.. శరీరంలో 13 చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి.

తన ప్రాణాలను కాపాడుకునేందుకు గుల్షన్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నాడు. 17 రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. గుల్షన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మార్చి 29న గుల్షన్ పై దాడి జరిగింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

 

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here